Numbers - సంఖ్యాకాండము 15 | View All

1. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

ఇస్రాయేల్ ప్రజలు కనాను ప్రవేశించే అవకాశం మరో 40 ఏళ్ళపాటు జారవిడుచుకున్నారు. అప్పుడు ఆ రోజుల్లో చాలా మంది కనానులోకి ఎప్పుడూ వెళ్ళలేదు. అయినప్పటికీ దాన్లోకి ప్రవేశించిన తరువాత వారు ఏమి చెయ్యాలో దేవుడు అప్పుడే ఇస్రాయేల్ ప్రజతో చెప్పసాగాడు – తరువాత ఇస్రాయేల్ ప్రజ ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటారన్నది అంత నిశ్చయమన్న మాట. ఈ విషయంలో ఇస్రాయేల్‌వారు ఓడిపోయారు గాని దేవుడు మాత్రం తన వాగ్దానం విషయంలో ఓడిపోడు. ఈ పుస్తకంలో 10–20 అధ్యాయాల్లో ముప్ఫై ఎనిమిది ఏళ్ళ కాలాన్ని గురించి రాసి ఉంది. ఆ కాలంలో ఇస్రాయేల్‌వారు కనాను ప్రాంతానికి దక్షిణంగా ఎడారి ప్రదేశాల్లో తిరుగుతూ వచ్చారు. ఈ అధ్యాయంలో ఉన్న ఆదేశాలు చాలామట్టుకు మునుపు సీనాయి కొండ దగ్గర యాజులకు ఇచ్చినవే. ఇక్కడ వాటినే మళ్ళీ చెప్పడంలో వారికీ దేవునికీ మధ్య ఉన్న ఒడంబడిక ఇంకా నిలిచే ఉంది అన్న విషయం అర్థమౌతున్నది. అంటే తన ఆదేశాలను వారు అనుసరించడం మానెయ్యకూడదు. దేవుడు వారిని కనానులోకి తీసుకువెళ్ళే ఆలోచన విరమించు కోలేదు.

2. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము-నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత

3. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱ మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

4. యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.

5. ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో కూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణ ముగా సిద్ధపరచవలెను.

6. పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచ వలెను.

7. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.

8. మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమా ధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగా నైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

9. ఆ కోడెతో కూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను.

10. మరియయెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా

11. పడిన్నర ద్రాక్షా రసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.

12. మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.

13. దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను.

14. మీయొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.

15. సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.

16. మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను.

17. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెనునీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
రోమీయులకు 11:16

18. నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత

19. మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణ మును యెహోవాకు అర్పింపవలెను.

20. మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.

21. మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.

22. యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా

పొరపాటున దేవుని ఆజ్ఞను మీరినా అది పాపమే. ఇది ప్రజలకు హానికరం, దేవుని పవిత్రతకు ధిక్కారం. దీనికీ ప్రాయశ్చిత్తం అవసరమే (లేవీయకాండము 4:2 కీర్తనల గ్రంథము 19:12-13).

23. యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల

24. సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచ వలెను.

25. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును, అనగా యెహో వాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.

26. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారి మధ్యను నివ సించు పరదేశి యేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను.

27. ఒకడు పొరబాటున పాపము చేసినయెడల వాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.

28. పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చి త్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన వాడు క్షమాపణ నొందును.

29. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారి మధ్యను నివసించు పరదేశి యేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.

30. అయితే దేశమందు పుట్టినవాడేగాని పర దేశియే గాని యెవడైనను సాహసించి పాపము చేసిన యెడల

31. వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును; వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయ బడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.

గర్వంవల్ల, తిరుగుబాటువల్ల కావాలని పాపం చేస్తే అది వేరే విషయం. అలాంటివారు దేవుని పేరును దూషిస్తూ ఆయన వాక్కును తృణీకరిస్తున్నారు. ఇలాంటి విషయాలు ప్రజల్లో ఉంటే దేవుని దీవెనలు వారిమీద ఉండవు, సరిగదా అలాంటి వారిమీద దేవుని కోపం ఉంటుంది. అలాంటి వారిని తీవ్రంగా శిక్షించాలి. నిజమే, అన్ని రకాల పాపాలకూ, దూషణలకూ (దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు తప్ప) క్షమాపణ ఉంటుందని యేసుప్రభువు అన్నాడు (మత్తయి 12:31). కాని కావాలని చేసిన ఇలాంటి పాపాలకు క్రైస్తవుడు తన జీవితంలో తీవ్రమైన ఫలితాలు ఎదుర్కోవలసి ఉంటుంది (1 కోరింథీయులకు 5:1-13 1 కోరింథీయులకు 11:29-30).

32. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.

విశ్రాంతి దినాన ఒక మనిషి నాలుగు ఎండు పుల్లలు ఏరుకున్నందువల్ల అతన్ని రాళ్ళతో కొట్టి చంపారు. ఇది న్యాయమేనా? అవును, న్యాయమే. ఎందుకంటే దేవుడు తానే స్వయంగా అలా చేయాలన్నాడు. కావాలని చేసే పాపాల గురించి ఇప్పుడే ఆయన వారికి హెచ్చరికలు ఇచ్చాడు. ఈ మనిషి విశ్రాంతి దినాన ఎండు పుల్లలు ఏరుకోవడం స్వల్ప విషయం కాదు. తేలికగా తీసిపారెయ్యవలసిన పొరపాటు కానే కాదు. ఇతడు దేవుణ్ణి ధిక్కరించాడు, ఆయన వాక్కును తృణీకరించాడు (నిర్గమకాండము 20:9-11). అతను చావవలసింది ఇందుకే. ధర్మశాస్త్రం ఇచ్చే న్యాయమైన తీర్పు విషయం ఇది ఒక ఉదాహరణ. ధర్మశాస్త్రం కేవలం శిక్ష విధిస్తుంది. అది దయ చూపించదు. ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే మనందరం శిక్షార్హులమే, చావవలసిన వాళ్ళమే (రోమీయులకు 3:19 గలతియులకు 3:10-14). ఇలాంటి ఉదాహరణల ద్వారా ధర్మశాస్త్రం మనలను కృప కరుణాలకోసం క్రీస్తును ఆశ్రయించాలని నేర్పిస్తుంది (గలతియులకు 3:24). మనకు దేవుని శుభవార్త ఎంతగా అవసరమో ఉపదేశిస్తుంది. శుభవార్త లేకపోతే మనందరం మరణానికీ నరకానికీ వెళ్తున్నవారమే. నిర్గమకాండము 19:21-25 లో ధర్మశాస్త్రం గురించి నోట్.

33. వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్ద కును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొనివచ్చిరి.

34. వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.

35. తరువాత యెహోవాఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.

36. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.

37. మరియయెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

38. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.
మత్తయి 23:5

39. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లు మునుపటివలె కోరినవాటిని బట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక,
మత్తయి 23:5

“కుచ్చులను చూచి...జ్ఞాపకం”– మానవ స్వభావం మీద పాపానికి ఇంత ప్రభావం ఉంది కాబట్టీ, స్వంత కోరికలనూ కంటికింపైన దానినీ అనుసరించాలన్న ప్రేరేపణ మనిషిలో ఇంత బలంగా ఉంది కాబట్టీ దేవునికి లోబడి ఉండాలని పదే పదే హెచ్చరిస్తూ ఉండడం చాలా అవసరం. అయితే కపట భక్తులు తమ హృదయాశలనూ నేత్రాశలనూ అనుసరిస్తూనే ఈ కుచ్చుల గురించిన మంచి ఆదేశాన్ని తారుమారు చేసి తమకు అనుకూలంగా మార్చుకొని వాటిమూలంగా మనుషుల ఎదుట తమ నిష్ఠనూ స్వనీతినీ ప్రదర్శించబూనుకొన్నారు (మత్తయి 23:5).

40. దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును.

41. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.Shortcut Links
సంఖ్యాకాండము - Numbers : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |