Mark - మార్కు సువార్త 14 | View All

1. రెండు దినములైన పిమ్మట పస్కాపండుగ, అనగా పులియని రొట్టెలపండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులును శాస్త్రులును మాయోపాయముచేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొను చుండిరి గాని

1. పస్కా పండుగకు, పులియబెట్టని రొట్టెల పండుగకు రెండురోజుల ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును బంధించి చంపటానికి పన్నాగం పన్నటం మొదలు పెట్టారు.

2. ప్రజలలో అల్లరి కలుగు నేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి.

2. ‘కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజలు అల్లర్లు మొదలు పెట్టవచ్చు’ అని మాట్లాడుకొన్నారు.

3. ఆయన బేతనియలో కుష్ఠరోగియైన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండియున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసికొని వచ్చి, ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తలమీద పోసెను.

3. ఆ సమయంలో యేసు బేతనియలో ఉన్నాడు. ఆయన కుష్టురోగి సీమోను ఇంట్లో భోజనానికి కూర్చొని ఉండగా, ఒక స్త్రీ ఇంట్లోకి వచ్చింది. ఆమె స్వచ్ఛమైన అగరు చెట్లనుండి చేసిన మిక్కిలి విలువైన అత్తరును ఒక చలువరాతి బుడ్డిలో తన వెంట తెచ్చింది. ఆ బుడ్డి మూత పగులగొట్టి ఆ అత్తరును యేసు తలపై పోసింది.

4. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరచనేల?

4. ఇది చూసి అక్కడున్న వాళ్ళలో కొందరికి కోపం వచ్చింది. వాళ్ళు పరస్పరం, “అత్తరును ఇలా వృధా చేయటం ఎందుకు?

5. ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటె ఎక్కువ వెలకమ్మి, బీదలకియ్యవచ్చునని చెప్పి ఆమెనుగూర్చి సణుగుకొనిరి.

5. దాన్ని అమ్మితే మూడు వందల దేనారాలు వచ్చేవి. ఆ డబ్బు పేదవాళ్ళకు యిచ్చి ఉండవలసింది” అని ఆ స్త్రీని గూర్చి గొణుక్కున్నారు.

6. అందుకు యేసు ఇట్లనెను ఈమె జోలికిపోకుడి; ఈమెను ఎందుకు తొందరపెట్టుచున్నారు? ఈమె నాయెడల మంచి కార్యము చేసెను.

6. యేసు, “ఆపండి. ఆమెనెందుకు కంగారు పెడుతున్నారు. ఆమె మంచి పని చేసింది.

7. బీదలు ఎల్లప్పుడును మీతోనే యున్నారు, మీకిష్టమైనప్పుడెల్ల వారికి మేలు చేయ వచ్చును; నేను ఎల్లప్పుడును మీతో నుండను.
ద్వితీయోపదేశకాండము 15:11

7. పేదవాళ్ళు మీలో ఎప్పుడూ ఉంటారు. మీ కిష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చెయ్యవచ్చు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను.

8. ఈమె తన శక్తికొలదిచేసి, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను.

8. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నన్ను సమాధికి సిద్ధం చేయాలని ఆమె నా దేహంపై అత్తరు పోసింది.

9. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

9. ఇది నిజం. ప్రపంచంలో సువార్త ప్రకటించిన ప్రతిచోటా ఆమె జ్ఞాపకార్థంగా ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

10. పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా, ప్రధానయాజకుల చేతికి ఆయనను అప్పగింప వలెనని వారియొద్దకు పోగా

10. ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు, యేసును ప్రధాన యాజకులకు పట్టివ్వటానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు.

11. వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టు చుండెను.

11. వాళ్ళు ఇది వినిచాలా ఆనందపడి, అతనికి డబ్బిస్తామని వాగ్దానం చేసారు. అందువల్ల యూదా యేసును పట్టివ్వటానికి తగిన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.

12. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులునీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన నడుగగా,
నిర్గమకాండము 12:6, నిర్గమకాండము 12:15

12. పులియబెట్టని రొట్టెలపండుగ వచ్చింది. మొదటి రోజు పస్కా గొఱ్ఱెపిల్లను బలి యివ్వటం ఆచారం. ఆ రోజు యేసు శిష్యులు ఆయనతో, “ఎక్కడికి వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.

13. ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును;

13. యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నగరంలోకి వెళ్ళండి. నీళ్ల కడవనెత్తుకొని వస్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించండి.

14. వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి.

14. అతడు ప్రవేశించిన యింటి యజమానితో, అతిథులు ఉండే గది ఎక్కడుందో బోధకుడు అడగమన్నాడని, ఆయన తన శిష్యులతో కలిసి ఆ గదిలో పస్కా పండుగ భోజనం చెయ్యాలని అనుకుంటున్నాడని, నేను అన్నట్లు చెప్పండి.

15. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచు డని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను.

15. అన్ని వస్తువులతో సిద్దంగా ఉన్న మేడమీది విశాలమైన గదిని అతడు మీకు చూపుతాడు. మనకోసం అక్కడ భోజనం ఏర్పాటు చేయండి.”

16. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.

16. శిష్యులు పట్టణంలోకి వెళ్ళారు. యేసు చెప్పి నట్లే అన్నీ జరిగాయి. వాళ్ళు పస్కా పండుగ భోజనం సిద్ధం చేసారు.

17. సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.

17. సాయంత్రం కాగానే యేసు పన్నెండుగురితో కలిసి వచ్చాడు.

18. వారు కూర్చుండి భోజనము చేయుచుండగా యేసుమీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా
కీర్తనల గ్రంథము 41:9

18. వాళ్ళంతా బల్లముందు కూర్చొని భోజనం చేస్తూవున్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, “ఇది నిజం. మీలో ఒకడు అంటే ప్రస్తుతం నాతో కూర్చొని భోజనం చేస్తున్న వాళ్ళలో ఒకడు, నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

19. వారు దుఃఖపడినేనా అని యొకని తరువాత ఒకడు ఆయన నడుగసాగిరి.

19. వాళ్ళకు దుఃఖం వచ్చింది. ‘ఖచ్చితంగా నేను కాదుగదా ప్రభూ’ అని ఒకరి తర్వాత ఒకరు ఆయనతో అన్నారు.

20. అందుకాయన పండ్రెండు మందిలో ఒకడే, అనగా నాతోకూడ పాత్రలో (చెయ్యి) ముంచు వాడే.

20. యేసు, “మీ పన్నెండుగురిలో ఒకడు, నాతో కలిసి రొట్టె గిన్నెలో ముంచేవాడు, నాకు ద్రోహం చేస్తాడు.

21. నిజముగా మనుష్యకుమారుడు ఆయననుగూర్చి వ్రాయబడినట్టు పోవుచున్నాడు; అయితే ఎవనిచేత మనుష్యకుమారుడు అప్పగింపబడుచున్నాడో, ఆ మను ష్యునికి శ్రమ; ఆ మనుష్యుడు పుట్టియుండనియెడల వానికి మేలనెను.

21. లేఖనాల్లో వ్రాసిన విధంగా మనుష్యకుమారుడు వెళ్లిపోవుచున్నాడు. కాని మనుష్యకుమారునికి ద్రోహం చేసినవాడు శాపగ్రస్తుడౌతాడు. వాడు జన్మించివుండకపోతే బాగుండేది” అని అన్నాడు.

22. వారు భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా శరీరమనెను.

22. అంతా భోజనం చేస్తుండగా, యేసు రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది నా దేహం, దీన్ని తీసుకొండి” అని అన్నాడు.

23. పిమ్మట ఆయన గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను; వారందరు దానిలోనిది త్రాగిరి.

23. ఆ తర్వాత గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాళ్ళకిచ్చాడు. వాళ్ళందరూ ఆ గిన్నె నుండి త్రాగారు.

24. అప్పుడాయన ఇది నిబంధనవిషయమై అనేకుల కొరకు చిందింపబడు చున్న నా రక్తము.
నిర్గమకాండము 24:8, జెకర్యా 9:11

24. ఇది నా నిబంధన రక్తం. ఆ రక్తాన్ని అందరికోసం కార్చాను.

25. నేను దేవుని రాజ్యములో ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగుదినమువరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

25. ఇది నిజం. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించి క్రొత్త ద్రాక్షారసం త్రాగేదాకా, యిప్పుడు తప్ప మరెప్పుడూ ద్రాక్షారసం త్రాగను” అని యేసు అన్నాడు.

26. అంతట వారు కీర్తన పాడి ఒలీవలకొండకు వెళ్లిరి.

26. వాళ్ళు ఒక భక్తిగీతం పాడాక ఒలీవల కొండ మీదికి వెళ్ళారు.

27. అప్పుడు యేసు వారిని చూచిమీరందరు అభ్యంతర పడెదరు; గొఱ్ఱెల కాపరిని కొట్టుదును; గొఱ్ఱెలు చెదరిపోవును అని వ్రాయబడియున్నది గదా.
జెకర్యా 13:7

27. అని వ్రాయబడింది.

28. అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లెదననెను.

28. 'కాని, నేను బ్రతికివచ్చాక మీకన్నా ముందుగా గలిలయకు వెళ్తాను” అని యేసు వాళ్ళతో అన్నాడు.

29. అందుకు పేతురు అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా

29. అప్పుడు పేతురు, “అందరి విశ్వాసం పోయినా నా విశ్వాసం సన్నగిల్లదు” అని అన్నాడు.

30. యేసు అతని చూచినేటి రాత్రి కోడి రెండుమారులు కూయకమునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా ననెను.

30. యేసు సమాధానంగా, “ఇది నిజం. ఈ రోజు, అంటే ఈ రాత్రి కోడి రెండు సార్లు కూయక ముందే నీవు మూడుసార్లు నేనెవరో తెలియదంటావు” అని అన్నాడు.

31. అతడు మరి ఖండితముగానేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనే చెప్పననెను. అట్లు వారందరుననిరి.

31. కాని పేతురు ఎన్నటికి అలా అననని అంటూ, “నేను మీతో మరణించవలసి వచ్చినా సరే నేనెప్పటికీ మీరెవరో తెలియదనను” అని అన్నాడు. మిగతా శిష్యులు కూడా అదేవిధంగా అన్నారు.

32. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు, ఆయన - నేను ప్రార్థనచేసి వచ్చువరకు మీరిక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి

32. అంతా గెత్సేమనె అనే స్థలానికి వెళ్ళారు. అక్కడ యేసు తన శిష్యులతో, “నేను ప్రార్థించి వచ్చేదాకా మీరిక్కడే ఉండండి” అని అన్నాడు.

33. పేతురును యాకోబును యోహానును వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరం భించెను

33. కాని యేసు పేతురును, యాకోబును, యోహానును, తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు చాలా దుఃఖం, ఆవేదన కలగటం మొదలుపెట్టింది.

34. అప్పుడాయననా ప్రాణము మరణమగు నంతగా దుఃఖములో మునిగియున్నది; మీరిక్కడ ఉండి మెలకువగా నుండుడని వారితో చెప్పి
కీర్తనల గ్రంథము 42:5, కీర్తనల గ్రంథము 42:11, కీర్తనల గ్రంథము 43:5, యోనా 4:9

34. ఆయన వాళ్ళతో, “నా ఆత్మ ప్రాణం పోయేటంత దుఃఖాన్ని అనుభవిస్తోంది. ఇక్కడే కూర్చొని మెలకువతో ఉండండి” అని అన్నాడు.

35. కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్దనుండి తొలగిపోవలెనని ప్రార్థించుచు

35. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై మోకరిల్లి వీలైతే ‘ఆ ఘడియ’ రాకూడదని ప్రార్థిస్తూ,

36. నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.

36. ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం ఈ దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.

37. మరల ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి సీమోనూ, నీవు నిద్రించుచున్నావా? ఒక్క గడియయైనను మేలుకొనియుండలేవా?

37. ఆయన వచ్చి తన శిష్యులు నిద్రిస్తుండడం చూసాడు. ఆయన పేతురుతో, “సీమోనూ! నిద్రిస్తున్నావా, ఒక గంట మేలుకో లేక పోయావా?

38. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి

38. 38మెలకువతో ఉండండి. ప్రార్థించండి. అప్పుడే మీరు సైతాను ప్రేరణకు లోంగకుండా ఉంటారు. ఆత్మ సిద్ధమే కాని శరీరంలో బలం లేదు” అని అన్నాడు.

39. తిరిగి పోయి, యింతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను.

39. యేసు, మళ్ళీ వెళ్ళి మొదటివలే ప్రార్థించాడు.

40. ఆయన తిరిగివచ్చి చూడగా, వారు నిద్రించుచుండిరి; ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయనకేమి ఉత్తరమియ్యవలెనో వారికి తోచ లేదు.

40. ఆయన తిరిగివచ్చి శిష్యుల కళ్ళు భారంగా ఉండటంవల్ల వాళ్ళు నిద్రిస్తూ వుండటం గమనించాడు. ఆయనకు ఏం సమాధానం చెప్పాలో శిష్యులకు తోచలేదు.

41. ఆయన మూడవ సారి వచ్చిమీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇక చాలును, గడియ వచ్చినది; ఇదిగో మనుష్యకుమారుడు పాపులచేతికి అప్పగింపబడు చున్నాడు;

41. యేసు మూడవసారి తిరిగివచ్చి వాళ్ళతో, “ఇంకా హాయిగా నిద్రిస్తున్నారా? చాలించండి. సమయం ఆసన్నమైంది. అదిగో చూడండి. మనుష్య కుమారుడు పాపులకు అప్పగింపబడుతున్నాడు.

42. లెండి వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించు వాడు సమీపించియున్నాడని చెప్పెను.

42. లేవండి! వెళ్దాం రండి. అదిగో! ద్రోహి వస్తున్నాడు!” అని అన్నాడు.

43. వెంటనే, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనులు కత్తులు గుదియలు పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రులయొద్దనుండియు పెద్దలయొద్దనుండియు వచ్చిరి.

43. ఆయన ఇంకా మాట్లాడుతుండగా పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు పంపిన ప్రజలు కత్తులు, కర్రలు పట్టుకొని యూదా వెంట ఉన్నారు.

44. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దుపెట్టు కొందునో ఆయనే (యేసు); ఆయనను పట్టుకొని భద్రముగా కొనిపోవుడని వారికి గురుతు చెప్పియుండెను.

44. ఆ ద్రోహి వాళ్ళతో, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకొంటానో ఆయనే యేసు. ఆయన్ని బంధించి భటుల మధ్య ఉంచి తీసుకు వెళ్ళండి” అని వాళ్ళతో చెప్పాడు. ఆయన్ని ముద్దు పెట్టుకొని వాళ్ళకు సంజ్ఞ చేస్తానని ముందే వాళ్ళతో మాట్లాడుకొన్నాడు.

45. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి, ఆయనను ముద్దుపెట్టుకొనగా

45. వెంటనే యూదా, యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ!” అని అంటూ ఆయన్ని ముద్దు పెట్టుకొన్నాడు

46. వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.

46. వచ్చిన ప్రజలు యేసును బంధించారు.

47. దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను.

47. యేసు ప్రక్కన నిలుచున్న వాడొకడు తన కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికి వేసాడు.

48. అందుకు యేసు మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా?

48. యేసు, “మీరు కత్తులతో, కర్రలతో వచ్చి బంధించటానికి నేనేమైనా దొంగనా?

49. నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించు చుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే లేఖనములు నెరవేరునట్లు (ఈలాగు జరుగుచున్నదని చెప్పెను).

49. నేను ప్రతిరోజు మందిరంలో బోధిస్తూ మీతో ఉన్నవాణ్ణే. అప్పుడు నన్ను ఎందుకు బంధించలేదు? కాని లేఖనాల్లో వ్రాసింది జరిగి తీరాలి” అని అన్నాడు.

50. అప్పుడు వారందరు ఆయనను విడిచి పారిపోయిరి.
జెకర్యా 13:7

50. అప్పుడు యేసు అనుచరులందరూ ఆయన్ని ఒంటరిగా వదిలి పారిపోయారు.

51. తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు ఆయన వెంట వెళ్లుచుండగా, వారతనిని పట్టుకొనిరి.

51. ఒక యువకుడు యేసును అనుసరిస్తూ ఉన్నాడు. అతని వంటిమీద నడుముకు కట్టుకొన్న గుడ్డ తప్ప మరేది లేదు. ప్రజలు వానిని కూడా గభాలున పట్టుకున్నారు. కాని,

52. అతడు నారబట్ట విడిచి, దిగంబరుడై పారిపోయెను.

52. అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.

53. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసికొని పోయిరి. ప్రధానయాజకులు పెద్దలు శాస్త్రులు అందరును అతనితోకూడవచ్చిరి.

53. వాళ్ళు యేసును ప్రధానయాజకుని దగ్గరకు తీసుకు వెళ్ళారు. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అక్కడ సమావేశం అయ్యారు.

54. పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి ఆయన వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద చలి కాచు కొనుచుండెను.

54. పేతురు కొంత దూరంలో ఉండి వాళ్ళను అనుసరిస్తూ ప్రధాన యాజకుని యింటి పెరట్లోకి వచ్చాడు. భటులతో పాటు తాను కూడా చలిమంటలు వేసుకొంటూ వాళ్ళతో కూర్చున్నాడు.

55. ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద సాక్ష్యము వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు.

55. ప్రధానయాజకులు, మహాసభకు చెందిన అందరు సభ్యులు, యేసుకు మరణదండన విధించటానికి తగిన సాక్ష్యం కోసం వెతక సాగారు. కాని వాళ్ళకు సాక్ష్యం లభించలేదు.

56. అనేకులు ఆయనమీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు.

56. చాలా మంది ప్రతికూలంగా దొంగసాక్ష్యం చెప్పారు. కాని వాళ్ళ సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పొసగలేదు.

57. అప్పుడు కొందరు లేచి చేతిపనియైన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దిన ములలో చేతిపనికాని మరియొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని

57. అప్పుడు కొందరు లేచి ఈ దొంగ సాక్ష్యం చెప్పారు:

58. ఆయనమీద అబద్ధసాక్ష్యము చెప్పిరి

58. “మానవులు కట్టిన ఈ మందిరాన్ని పడగొట్టి మూడు రోజుల్లో మానవులు కట్టని మరొక మందిరాన్ని నిర్మిస్తాను’ అని అతడు అనటం మేము విన్నాము.”

59. గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు.

59. కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు.

60. ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకు చున్న సాక్ష్యమేమని యేసు నడిగెను.
యెషయా 53:7

60. ఆ తర్వాత ప్రధాన యాజకుడు లేచి సభ్యుల ముందు నిలుచొని యేసుతో, “నీవు సమాధానం చెప్పదలచుకోలేదా? వీళ్ళు నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతున్నారు కదా! నీవేమంటావు?” అని అడిగాడు.

61. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడుపరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయన నడుగగా
యెషయా 53:7

61. కాని యేసు ఏ సమాధానం చెప్పక మౌనం వహించాడు. ప్రధాన యాజకుడు, “నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువా? మానవులు స్తుతించే దేవుని కుమారుడవా?” అని మళ్ళీ ప్రశ్నించాడు.

62. యేసుఅవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను.
కీర్తనల గ్రంథము 110:1-2, దానియేలు 7:13

62. యేసు, “ఔను, సర్వశక్తి సంపన్నుడైన దేవుని కుడిచేతి వైపు మనుష్యకుమారుడు కూర్చొని ఉండటం, ఆయన పరలోకంలో నుండి మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.

63. ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని యేమి?
సంఖ్యాకాండము 14:6

63. ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని “మనకు యితర సాక్ష్యాలు ఎందుకు?

64. ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరుమరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి.
లేవీయకాండము 24:16

64. అతడు దైవ దూషణ చేయటం మీరు విన్నారుగదా; మీ అభిప్రాయమేమిటి?” అని సభ్యుల్ని అడిగాడు. అందరూ మరణ దండన విధించాలని అన్నారు.

65. కొందరు ఆయనమీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచుప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి.

65. ఆ తర్వాత కొందరు యేసు మీద ఉమ్మివేయటం మొదలుపెట్టారు. కొందరు ఆయన కళ్ళకు గంతలు కట్టి తమ పిడికిలితో గుద్ది, “ఎవరో చెప్పుకో” అని హేళన చేసారు. కాపలాకాచే భటులు ఆయన్ని తీసుకువెళ్ళి కొట్టారు.

66. పేతురు ముంగిటి క్రిందిభాగములో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తెలలో ఒకతె వచ్చి

66. పేతురు, క్రింద యింటి ముందు పెరట్లో ఉన్నాడు. ప్రధాన యాజకుని దాసీలలో ఒకతె అక్కడకు వచ్చింది.

67. పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను; అతనిని నిదానించి చూచి నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడ ఉండినవాడవు కావా? అనెను.

67. పేతురు చలిమంటలు వేసుకొంటూ అక్కడ ఉండటం చూసి అతని దగ్గరకు వెళ్ళి అతణ్ణి పరీక్షగా చూసింది. “నజరేతు యేసుతో నీవు కూడా ఉన్నావు కదూ!” అని ఆమె పేతురుతో అన్నది.

68. అందుకతడు ఆయన ఎవడో నేనెరు గను; నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవ లోనికి వెళ్లెను; అంతట కోడి కూసెను.

68. అతడు నాకు తెలియదంటూ, “నీవేం అంటున్నానో నాకు అర్థం కావటంలేదు” అని అన్నాడు. పేతురు ద్వారం వైపు వెళ్ళాడు. వెంటనే కోడికూసింది.

69. ఆ పనికత్తె అతనిని చూచివీడు వారిలో ఒకడని దగ్గర నిలిచియున్న వారితో మరల చెప్పసాగెను.

69. ఆ దాసీపిల్ల పేతురును చూసి, చుట్టూ ఉన్న వాళ్ళతో ఇతడు వాళ్ళలో ఒకడు అని మళ్ళీ అన్నది.

70. అతడు మరలనేను కాననెను. కొంతసేపైన తరువాత దగ్గర నిలిచియున్నవారు మరల పేతురును చూచినిజముగా నీవు వారిలో ఒకడవు; నీవు గలిలయుడవు గదా అనిరి.

70. మళ్ళీ పేతురు, “అది నిజం కాదు; నాకు తెలియదు” అని అన్నాడు. కొద్ది సేపయ్యాక పేతురుతో నిలుచున్న వాళ్ళు అతనితో, “నీవు కూడ గలిలయ వాడవు కనుక తప్పకుండా వాళ్ళలో ఒకడివి” అని అన్నారు.

71. అందుకతడు మీరు చెప్పుచున్న మనుష్యుని నేనెరుగనని చెప్పి, శపించుకొనుటకును ఒట్టు బెట్టుకొనుటకును మొదలు పెట్టెను.

71. తన మీద ఒట్టు పెట్టుకొంటూ, “ప్రమాణంగా చెబుతున్నాను. మీరు మాట్లాడుతున్న మనిషి ఎవరో నాకు తెలియదు” అన్నాడు.

72. వెంటనే రెండవమారు కోడికూసెను గనుకకోడి రెండు మారులు కూయకమునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని తలపోయుచు ఏడ్చెను.

72. వెంటనే రెండవసారి కోడికూసింది. అప్పుడు యేసు తనతో అన్న ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి రెండు సార్లు కూయకముందే నేనెవరో తెలియదని మూడుసార్లు అంటావు.” పేతురు దుఃఖం ఆపుకోలేక శోకించటం మొదలు పెట్టాడు.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Mark - మార్కు సువార్త 14 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

క్రీస్తు బేతనియలో అభిషేకించబడ్డాడు. (1-11) 
"క్రీస్తు మనకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడా, దానికి ప్రతిఫలంగా అందించలేని విలువైనదేదైనా మనం పరిగణించగలమా? మన ప్రగాఢమైన ఆప్యాయత అనే అమూల్యమైన లేపనాన్ని ఆయనకు సమర్పించగలమా? మన ఉత్సాహం మరియు ఆప్యాయత కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిద్దాం. లేదా విమర్శించబడింది.అదృష్టవంతులకు దాతృత్వం చూపడం అనేది యేసుప్రభువు పట్ల నిర్దిష్టమైన భక్తిని చూపడం నుండి మనలను మినహాయించకూడదని మరచిపోకూడదు.క్రీస్తు కాలమంతా విశ్వాసుల ప్రయోజనం కోసం ఈ స్త్రీ యొక్క పవిత్రమైన భక్తిని ప్రశంసించాడు. గౌరవించబడాలి.జుడాస్ తన తృప్తి చెందని దురాశతో చిక్కుకున్నాడు, అతని యజమానికి ద్రోహం చేయడానికి దారితీసింది; ఈ బలహీనతను ఉపయోగించుకోవడానికి దెయ్యం అతని టెంప్టేషన్‌ను రూపొందించాడు, తద్వారా అతనిపై విజయం సాధించాడు. ఇది చాలా మంది తమ పాపపు ప్రయత్నాలలో రూపొందించిన చెడు పథకాలను గుర్తు చేస్తుంది. కానీ వారి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం తరచుగా వారి పతనానికి దారి తీస్తుంది."

పాస్ ఓవర్, జుడాస్ తనకు ద్రోహం చేస్తాడని యేసు ప్రకటించాడు. (12-21) 
ఇక్కడ వివరించిన సంఘటనలు మానవ నిరీక్షణకు సంబంధించినవి కావు. ఏది ఏమైనప్పటికీ, మన ప్రభువు మనకు సంబంధించిన అన్ని విషయాల గురించి అవి విప్పకముందే సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. మనం ఆయనను స్వాగతిస్తే, ఆయన మన హృదయాలలో నివాసం ఉంటాడు. గొర్రెపిల్ల వధకు దారితీసినట్లు ప్రవచించినట్లుగానే మనుష్యకుమారుడు వెళ్లిపోతాడు. కానీ అతనికి ద్రోహం చేసేవాడికి దుఃఖం ఎదురుచూస్తుంది! మానవ పాపాలను దేవుడు అనుమతించడం మరియు వాటి నుండి మహిమను పొందగల అతని సామర్థ్యం ఈ పాపాలకు సమర్థనగా చూడకూడదు. ఇది వారికి పాల్పడిన వారి అపరాధాన్ని క్షమించదు లేదా వారి పరిణామాలను తగ్గించదు.

ప్రభువు రాత్రి భోజనం ఏర్పాటు చేయబడింది. (22-31) 
దేవుని భోజనం ఆత్మకు పోషణగా పనిచేస్తుంది, కాబట్టి భౌతిక మూలకాలలో ఒక చిన్న భాగం మాత్రమే సరిపోతుంది. ఇది మా మాస్టర్ యొక్క ఉదాహరణ మరియు అభ్యాసం ద్వారా స్థాపించబడింది, అతని రెండవ రాకడ వరకు సహనం. ఆశీర్వాదం మరియు కృతజ్ఞతా వ్యక్తీకరణలతో, ఇది క్రీస్తు త్యాగం యొక్క స్మారకంగా పనిచేయడానికి సృష్టించబడింది. అతని విలువైన రక్తము, మన విమోచన యొక్క వెల, క్రీస్తు రక్తము అనేకుల కొరకు చిందింపబడుతుందని తెలిసి పశ్చాత్తాపపడిన పాపులకు ఓదార్పునిస్తుంది. చాలా మందికి అయితే, నాకు ఎందుకు కాదు? ఇది అతని త్యాగం ద్వారా పొందిన ప్రయోజనాలను తెలియజేస్తుంది. సిలువ వేయబడిన క్రీస్తు బోధలను మీకు అన్వయించుకోండి; ఇది మీ ఆత్మలకు జీవనోపాధిగా ఉండనివ్వండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఉత్తేజపరుస్తుంది మరియు పునరుజ్జీవింపజేస్తుంది. ఇది స్వర్గపు ఆనందం యొక్క సంగ్రహావలోకనం మరియు రుచిని అందిస్తుంది, ప్రాపంచిక ఆనందాల నుండి మన కోరికలను మళ్లిస్తుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించిన వారు వెంటనే శాశ్వతమైన రకం కోసం ఆరాటపడతారు. గొప్ప కాపరి తన బాధలను తడబడకుండా సహించగా, అతని అనుచరులు వారి స్వంత చిన్న పరీక్షల వల్ల తరచుగా నిరుత్సాహానికి గురవుతారు. మన గురించి మనం గొప్పగా ఆలోచించుకునే మరియు మన హృదయాలను విశ్వసించే ధోరణిని కలిగి ఉంటాము. వినయం మరియు విస్మయంతో కాకుండా పేతురు తన యజమానికి ఈ విధంగా స్పందించడం సరికాదు. ప్రభూ, నిన్ను తిరస్కరించకుండా నిరోధించడానికి నాకు దయ ఇవ్వండి.

తోటలో క్రీస్తు వేదన. (32-42) 
క్రీస్తు బాధలు అత్యంత తీవ్రమైన వేదనతో మొదలయ్యాయి, ముఖ్యంగా అతని ఆత్మలో. మత్తయి సువార్తలో స్పష్టంగా ఉపయోగించని పదాలు కానీ అర్థాన్ని సమృద్ధిగా ఉపయోగించడం ద్వారా అతను చాలా ఆశ్చర్యపోయాడు. దేవుని భయాందోళనలు ఆయనకు వ్యతిరేకంగా తమను తాము ఏర్పాటు చేసుకున్నాయి మరియు వాటిని ఎదుర్కోవడానికి ఆయన తనను తాను అనుమతించాడు. ఆ సమయంలో, అతని దుఃఖం అసమానమైనది. మా పూచీకత్తుగా చట్టం యొక్క శాపాల బరువును భరించి, అతను మన కోసం శాపాన్ని తీసుకున్నాడు. అతను నిజంగా మరణాన్ని దాని చేదులో రుచి చూశాడు. ఇది అపొస్తలుడు మాట్లాడే భయం, నొప్పి మరియు మరణం యొక్క సహజమైన భయం, ఇది మానవ స్వభావాన్ని వెనక్కి నెట్టివేస్తుంది. ప్రభువైన యేసుపై పాపం మోపబడినప్పటికీ, ఆ పాపం బాధాకరమైన బాధలను చూసినప్పుడు మనం పాపం గురించి అనుకూలమైన లేదా అల్పమైన ఆలోచనలను ఎలా కలిగి ఉండవచ్చు? పాపం ఆయనపై ఎంత భారంగా ఉందో పరిశీలిస్తే మనం దానిని తీవ్రంగా పరిగణించకూడదా? క్రీస్తు మన పాపాల కోసం అలాంటి వేదనను భరించాడు, కాబట్టి మనం వాటిపై వేదన చెందకూడదా? మనం గుచ్చుకున్న వ్యక్తిని చూసి దుఃఖించాలి. పాపం చేసినందుకు గాఢంగా విలపించడం మన కర్తవ్యం, దాన్ని ఎప్పటికీ తేలికపరచకూడదు.
క్రీస్తు, తన మానవ స్వభావంలో, అది సాధ్యమైతే, అతని బాధను నివారించవచ్చని వేడుకున్నాడు. అయినప్పటికీ, మధ్యవర్తిగా, అతను దేవుని చిత్తానికి లొంగిపోయాడు, "అయినప్పటికీ, నేను కోరినది కాదు, కానీ నీవు కోరినది." అతను దానిని ఇష్టపూర్వకంగా స్వీకరించాడు. క్రీస్తు శిష్యుల బలహీనత ఎలా పుంజుకుంటుందో మరియు వారిని ఎలా ముంచెత్తుతుందో మనం గమనిస్తాము. మన భౌతిక శరీరాలు తరచుగా మన ఆత్మలకు భారంగా పనిచేస్తాయి. అయితే, మనం ఇబ్బందిని ఊహించినప్పుడు, మనం దాని కోసం సిద్ధం కావాలి. దురదృష్టవశాత్తూ, విశ్వాసులు కూడా విమోచకుని బాధలను తరచుగా నీరసంగా చూస్తారు మరియు క్రీస్తుతో చనిపోవడానికి సిద్ధంగా ఉండడానికి బదులుగా, వారు ఒక గంట పాటు ఆయనతో చూడటానికి కూడా సిద్ధంగా లేరు.

అతను ద్రోహం చేయబడతాడు మరియు తీసుకోబడ్డాడు. (43-52) 
క్రీస్తు తనను తాను భూసంబంధమైన పాలకునిగా ప్రదర్శించుకోలేదు, బదులుగా పశ్చాత్తాపం, పరివర్తన మరియు నీతివంతమైన జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను బోధించాడు, ప్రజల దృష్టిని, ఆప్యాయతలను మరియు లక్ష్యాలను ఆధ్యాత్మిక రాజ్యం వైపు మళ్లించాడు, యూదు అధికారులు అతనిని నాశనం చేయాలని కోరుకున్నారు. పీటర్ అరెస్ట్ పార్టీ సభ్యుడిని గాయపరిచాడు. క్రీస్తు కోసం ఒకరి ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండటం కంటే పోరాటంలో అతని కోసం నిలబడటం చాలా సులభం. అయితే, అసంపూర్ణ శిష్యులు మరియు కపటుల మధ్య గణనీయమైన వ్యత్యాసం ఉంది. తరువాతి, ఆలోచన లేకుండా మరియు నిజమైన నిబద్ధత లేకుండా, యేసును వారి యజమాని అని పిలుస్తారు మరియు అతని పట్ల గొప్ప ప్రేమను వ్యక్తపరుస్తుంది, అయినప్పటికీ వారు చివరికి అతని విరోధులకు ద్రోహం చేస్తారు, తద్వారా వారి స్వంత పతనాన్ని వేగవంతం చేస్తారు.

ప్రధాన పూజారి ముందు క్రీస్తు. (53-65) 
ఈ ప్రకరణంలో, ప్రముఖ యూదు కౌన్సిల్ ముందు క్రీస్తు విచారణను మనం చూస్తాము. పీటర్ అతనిని అనుసరించాడు, కానీ ప్రధాన యాజకుని ప్రాంగణం అనుచితమైన ప్రదేశం, మరియు అతని పరిచారకులు పేతురుకు సరైన సంస్థ కాదు; అది టెంప్టేషన్ లోకి ఒక మార్గం. యేసుకు వ్యతిరేకంగా తప్పుడు సాక్షులను కనుగొనడానికి ఒక సమిష్టి ప్రయత్నం జరిగింది, అయినప్పటికీ వారి సాక్ష్యం వారి చట్టం యొక్క అత్యంత తీవ్రమైన వ్యాఖ్యానం ద్వారా కూడా మరణశిక్షకు సంబంధించినది కాదు. ‘నువ్వు ధన్యుడి కుమారుడివా’ అని ప్రశ్నించాడు. అంటే, "నువ్వు దేవుని కుమారుడివా?" దేవుని కుమారుడిగా తన గుర్తింపును స్థాపించడానికి, అతను తన రెండవ రాకడను సూచిస్తాడు. ఈ చర్యలలో, దేవుని పట్ల మానవత్వం యొక్క శత్రుత్వం మరియు మానవత్వం పట్ల దేవునికి ఉచిత మరియు వర్ణించలేని ప్రేమ యొక్క రుజువులను మేము కనుగొన్నాము.

పీటర్ క్రీస్తును తిరస్కరించాడు. (66-72)
పీటర్ క్రీస్తును తిరస్కరించడం అతని నుండి తన దూరం ఉంచాలనే అతని నిర్ణయంతో ప్రారంభమైంది. దైవభక్తిని స్వీకరించడానికి వెనుకాడేవారు క్రీస్తును తిరస్కరించే ప్రమాదకరమైన మార్గంలో ఉన్నారు. క్రీస్తు అనుచరులతో సహవాసం చేయడం ప్రమాదకరమని భావించేవారు, ఆయన కోసం బాధలు పడతారేమోనని భయపడి, ఆయన విరోధుల సహవాసంలో ఉండటం మరింత ప్రమాదకరమని, అక్కడ వారు ఆయనకు వ్యతిరేకంగా పాపంలోకి నడిపించబడవచ్చని తెలుసుకుంటారు. క్రీస్తును జరుపుకున్నప్పుడు మరియు అతని చుట్టూ ప్రజలు గుమిగూడినప్పుడు, పేతురు వెంటనే ఆయనను అంగీకరించాడు. అయినప్పటికీ, క్రీస్తు విడిచిపెట్టబడ్డాడు మరియు అపహాస్యం చేయబడ్డాడు కాబట్టి అతను ఇప్పుడు అతనికి ఎలాంటి సంబంధాన్ని నిరాకరించాడు. అయినప్పటికీ, పీటర్ యొక్క పశ్చాత్తాపం వేగంగా ఉందని గమనించాలి. పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని తాము బలంగా ఉన్నామని విశ్వసించే ఎవరికైనా ఇది రిమైండర్‌గా పనిచేస్తుంది, మరియు పొరపాట్లు చేసిన వారికి, వారి చర్యలు మరియు నేరాలను ప్రతిబింబించేలా, కన్నీళ్లు మరియు విన్నపాలతో ప్రభువు వద్దకు తిరిగి రావడం, క్షమాపణ మరియు పునరుద్ధరణను కోరడం. పరిశుద్ధాత్మ.



Shortcut Links
మార్కు - Mark : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |