1 దినవృత్తాంతములు 7:6-12; ఆదికాండము 46:21. బెన్యామీను, యూదా, లేవీ గోత్రాల వంశావళికి కేటాయించిన స్థలం మిగతా అన్ని గోత్రాలకూ ఇచ్చిన స్థలం కంటే ఎక్కువ. పవిత్రాత్మ ఆవేశం క్రింద, ఆయన నాయకత్వం క్రింద ఈ గ్రంథ రచయిత ఉద్దేశం యూదా రాజ్యం గురించి విపులంగా చెప్పడమే. జెరుసలం దేవాలయంలోని ఆలయ సేవ, యాజి ధర్మాలు లేవీగోత్రంవారి చేతుల్లో ఉన్నాయి, గనుక అది కూడా ముఖ్యమైనదే. ఇస్రాయేల్వారి మొదటి రాజు సౌలు బెన్యామీనువాడు, బెన్యామీను ప్రాంతంలో కొంత భాగాన్ని యూదా రాజ్యంలో కలపడం జరిగింది గనుక బెన్యామీను గోత్రం కూడా ముఖ్యమైనదే.